పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము

14


నంబై, సర్వలక్షణసంపన్నంబై, సర్వాగమానూనసంభావితసంస్తుత్యంబై, పరమధర్మోత్కృష్టంబై, పరమేశ్వరప్రియంబై, పార్వతీమనోహరంబై, శ్రీనాథసేవితంబై, బ్రహ్మరుద్రాది దేవతాసంస్తూయమానంబై, శోభిల్లు నిప్పుణ్యచారిత్రంబు దశదోషవివర్జితంబై.....నా నేర్చిన విధంబున రచియించెద నది యెట్టిదనినఁ బూర్వోక్తమార్గంబునఁ బరిపూర్ణంబై యథావిధి శోభిల్లు నిప్పుణ్యచారిత్రంబుఁ బోలినట్టి ధర్మక్షేత్రంబును మహాతీర్థంబును నగు గంగాకాలిందీసంగమంబున సంశ్రితాత్ములు సత్యవ్రతపరాయణులు నగు శౌనకాది మహామునులు దీర్ఘసత్రంబునందుఁ గూడియుండ వేదవ్యాసప్రియశిష్యుండు రోమహర్షణతనయుండు పౌరాణికుండు సూత్యాహిసంభవుండు సూతుం డేతెంచిన సంప్రహృష్టమానసు లయి యమ్మహామును లాసనార్ఘ్యపాద్యాదులం బూజించి యతని కిట్లనిరి.

44


సీ.

సర్వజ్ఞ రోమహర్షణతనూభవ సూత
             యఖిలపురాణవిద్యాప్రగల్భ
పంచావయవయుక్త భవ్యకావ్యవిదగ్ధ
             యాశ్చర్యహేతువులైన కథలు
రత్నాకరమునందు రత్నంబులునుబోలెఁ
             గలవు నీయందుఁ బొగడ్త గాదు
నీ వెఱుగని విద్య లీ విశ్వమున లేవు
             తర్కించి యెన్నివిధములఁ జూడ