పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

ప్రథమాశ్వాసము


గీ.

(సకలసద్గుణవి)ఖ్యాతసౌమనస్య
మహితపంచాక్షరీమంత్ర మంజులాత్మ.

24


క.

సెట్టియమారమ గాంచెను
దట్టుల భీమయ్యఁ బ్రోలధరణీధవునిన్
దుట్టురగండని ముమ్మయ
సెట్టన విలసిల్లు వీరశేఖరు నర్థిన్.

25


క.

పారావారగభీరుఁడు
నారీజనమన్మథుండు వరసుతుఁ డనఁగా
ధారణి సెట్టియభీముఁడు
వారక వర్ధిల్లునెపుడు వైభవ మలరన్.

26


క.

లాలితవైభవశీలుఁడు
లోలాక్షీమన్మథుండు లోకఖ్యాతుం
డాలోలచరిత్రుఁడు ధరఁ
బ్రోలామాత్యుండు వెలసెఁ బుణ్యోదయుఁడై.

27


సీ.

పంచాక్షరీమంత్రపారిజాతోద్భూత
             ఫలము లేగురువుసంభాషణములు
వీరశైవాచారవిమలమార్గానూన
             శాశ్వతం బేగురుస్వామిమహిమ
నిఖిలదేశాధీశనివహప్రణామైక
             పాత్ర మేగురుమూర్తిపాదయుగళి
శంకరపూజాప్రశస్తదీక్షాజనా
             (హ్లాద మేగు)రువుహస్తాంబుజాత