పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము

8


............................
             ..........................
పరమలింగధ్యానపారీణసద్బుద్ధి
             నల్లమప్రభు లీల నలరువాఁడు
రుచ్యర్పణక్రియారూఢి నిద్ధారణి
             మాదరచెన్నయ్య (మహిమవాఁడు)
చెలఁగె గురులింగజంగమసేవకుండు
మల్లికార్జునశివునకు మంత్రి యనఁగఁ
దూర్పునాఁడెల్లఁ బాలించు నేర్పరతఁడు
శ్రీసమేతుండు పోలయసెట్టివిభుఁడు.

22


వ.

అమ్మహాత్ముండు దనవర్ణంబునకుం దగినవర్ణనీయ యగుసాధ్వి వివాహంబయ్యె నంత.

23


సీ.

పార్వతీమూర్తియు భారతీదేవియు
             నిందిరారూపంబు నింద్రుసతియు
రోహిణీదేవియు రుక్మిణీదేవియు
             స్వాహాస్వధాతులశక్తిచయము
గంధర్వసతులును గందర్పుభామయుఁ
             (గశ్యపు)సాధ్వుఁలుఁ గ్రతువుసతియు
వరవసిష్ఠునిరాణి ధరఁ గుంభసంభవు
             రామయు నాదిత్యురమణిఁ గూడి
ధరణి నొక్కటఁ బుట్టించె ధాతయనఁగ
మగువ సెట్టిదేవాఖ్యుని మారమాంబ