పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము

2


న్నాలిని బుక్కిటం దిడి విహాయసవీథిని నంచ నెక్కి తాఁ
జాలఁ జరించు బ్రహ్మ ఘనశాంతుఁడు శాంతనఁ బ్రోచుఁ గావుతన్.

3


చ.

 హరిహరపద్మజాదులగు నాద్యులు సంతతభక్తియుక్తులై
చిరమగు నిష్టసంపదలఁ జేకొని లోకములన్ సృజింపఁగా
నరుదుగఁ బ్రేమఁ బ్రోవ లయమందఁగఁ జేయఁగఁ గర్తలైరి నీ
పరమహనీయతత్త్వ మనివార్యము సద్గుణశీల పార్వతీ.

4


గీ.

 మదనుఁ గన్నతల్లి మాధవునిల్లాలు
బ్రతుకులెల్లఁ దానె పట్టిచూడ
ముఖ్యమైన లక్ష్మి ముమ్మయశాంతాత్ము
మందిరంబునందు మసలుచుండు.

5


చ.

 కవికవితాబ్ధిలోన ముఖగహ్వర మోడయు జిహ్వ త్రెడ్డు హృ
త్పవనుఁడు పీలికాఁడు మృదుభాషలు రత్నము.............
..............మాత్మ వర్తకుని కైవడి నీకు విశేషసత్కృతుల్
గవయఁగ వచ్చె నీవలనఁ గావ్యసుఖస్థితి యిచ్చుఁగావుతన్.

6


సీ.

బాణు నద్భుతశాస్త్రబహుకలాపారీణుఁ
             బ్రకటవరకవితా..............
.........గాంభీర్యబంధానుబంధవి
             స్ఫురితమహోన్నతిస్తోము సోముఁ
జిరతరమతిభద్రుఁ జెన్నారు శివభద్రు
             నతులగుణస్ఫారు నమ్మయూరు
వరనీతిచాతురీవాగ్భూతి భవభూతి
              ........మోఘు మాఘు