పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

శివరాత్రిమాహాత్మ్యము

(సుకుమారచరిత్రము)

ప్రథమాశ్వాసము.

ఇష్టదేవతాప్రార్థనాదికము

శా.

శ్రీ - - - వాశ్రితోరస్స్థలీ
నాగాధీశవిశిష్టసంస్తవలసన్నాళీకపాదద్వయ
ప్రాగల్భ్యుం డగుశంకరుండు మనుచుం బ్రత్యక్షమై యెప్పుడున్
యోగీంద్రాఖ్యుని ముమ్మడీంద్రసుతుని న్నుద్యుక్తశాంతాత్మునిన్.

1


శా.

 శ్రీరామారమణుం డశేషజగతీక్షేమంకరప్రక్రియా,
భారాయత్తమనస్కుఁడార్యజనసంభావ్యుండుభవ్యాత్ముఁడై
గారామారఁగ నుమ్మమాంబికసుతున్ గౌరీశభక్తాగ్రణిన్
ధీరున్ ముమ్మయశాంతునిన్ మనుచు సందీర్ఘాయురర్థాఢ్యుఁగన్.

2


ఉ.

నాలుగుమోములం దనర నాలుగువేదము లభ్యసించుచున్
నాలుగునైదురూపముల నవ్యసుఖ........... చేసియున్