1981లో సిముక శాతకర్ణి నాణేలను కనుగొని తెలుగువారి చరిత్రకు కొత్త ఆధారాలు అందించిన శాస్త్రి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదు పురస్కారంతో గౌరవించింది. శాసన, నాణేల పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన శాస్త్రి గారిని ఎపిగ్రఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 1986లో, ఒక తామ్ర పత్రంతో సత్కరించారు. 1992లో తిరువనంతపురంలో జరిగిన సౌత్ ఇండియన్ న్యూమిన్‌మెటిక్ సొసైటీ, రెండో వార్షిక సమావేశానికి జనరల్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకొని గౌరవించింది. 1996లో, తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 21వ వార్షిక సమావేశానికి శాస్త్రిగారిని జనరల్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకొని సంస్థ సముచితంగా సత్కరించింది.
విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల, కృష్ణాజిల్లా రచయితల సంఘం, దివిసీమ ఇతిహాస పరిశోధక మండలి పురస్కారాలు, సద్గురు శివానందమూర్తిగారి ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారి చేతుల మీదుగా మాతృభాషా దినోత్సవం రోజున విశిష్టభాషాపురస్కారం, కడపలోని సీపీ బ్రౌన్ లైబ్రరీవారు సిపిబ్రౌన్ అవార్డును, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రిసర్చ్ వారి గౌరవ ఫెలోషిప్, ఇంకా తెలంగాణా రాష్ట్ర అవతరణ సందర్భంగా, తెలంగాణా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విశిష్ట పురస్కారాలను అందుకొన్నారు శాస్త్రిగారు.
పివిపి శాస్త్రి సన్మాన సంచిక: బ్రహ్మశ్రీ
డా. పీవీపరబ్రహ్మశాస్త్రిగారు, శాసనాలు, లిపి, భాష, సాహిత్యం, చరిత్ర రంగాల్లో చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీశైల ప్రాంగణంలోని పురావస్తుశాస్త్రం, చరిత్ర, శాసన అధ్యయనశాఖ పీఠాధిపతి ఆచార్య పెదారపు చెన్నారెడ్డి, బ్రహ్మశ్రీ: రిసర్చెస్ ఇన్ ఆర్కియాలజీ, హిస్టరీ కల్చర్ ఇన్ ది న్యూమిలేనియం అనే రెండు సంపుటాల సన్మాన గ్రంధాన్ని 2004లో వెలువరించారు. మొదటి సంపుటంలో పురావస్తు శాస్త్రం, కళ, వాస్తు శాస్త్రాలనే మొదటి విభాగంలో రాబర్ట్ బెడ్‌సరిక్, ఎన్. చంద్రమౌళి, జె.మాన్యుఎల్, పి.ఆర్.కె.ప్రసాద్, శోభనాగోఖలే, బ్రజేష్‌కృష్ణ, పి. మార్గబంధు, జయప్రియ రాజరాజన్, ఎండీ సంపత్, ఈమని శివనాగిరెడ్డి, రాజూకాళిదాస్, ఆర్కెకెరాజరాజన్, ఐకెశర్మ, టి. దయానంద్‌పటేల్, సి. అనిల్‌కుమార్,కె. పద్మనాభ, కె. ఎం. సురేష్, పి. జోగినాయుడు వ్యాసాలున్నాయి. శాసనాలు, నాణేలు అన్న రెండో విభాగంలో రోమిలాధాపర్, శ్రీనివాస్ హెచ్. రిత్తి, పీవీ నరసింహమూర్తి, వి.వి. కృష్ణశాస్త్రి, ఎస్. స్వామినాధన్, కె.వి.రమేష్, సీ.ఏ. పద్మనాభశాస్త్రి, హెచ్.ఎం.నాగరాజారావు, పి. బ్రహ్మచారి, ఎస్.జె. మంగళం, డి. రాజారెడ్డి, పి. సూర్యనారాయణరెడ్డి, హెచ్. ఆర్. రఘునాథభట్, ఎస్. దాశరథి వ్యాసాలు ఉన్నాయి.
రెండో సంపుటంలో, మతము, తర్కము, సాహిత్యమన్న మూడో విభాగంలో బి. సుబ్రహ్మణ్యం, జి, జవహర్ లాల్, ప్రణబానందఝా, వి.కె.మోహన్, సాళ్వ కృష్ణమూర్తి, ఏ. పద్మ, ఎం. ఎల్. ఖద్దర్‌శాస్త్రి, హరిప్రియా రంగరాజన్, జి.ఎస్.దీక్షిత్, ఎం.ఎస్. రామచంద్రరావు,
19