Jump to content

పుట:శాసనోపాసన.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమారుడైన మూడో విష్ణువర్ధనుడు క్రీ.శ. 718-52 పాంగునాల విషయంలోని బొండాడ గ్రామవాసుల సమక్షంలో, గోవిందశర్మకు కొంతభూమిని దానం చేసిన వివరాలున్నాయని తెలియజేశారు.

శాసన సాహిత్యంపై శాస్త్రిగారి పరిశోధన

శాసనాల్లో శ్లోకాలతోపాటు, వచనమే ఉంటుందనుకొంటున్న రోజుల్లో కుందూరు ఈశ్వరదత్తుగారు, శాసనాల్లోని పద్యాలను చంధో పరంగా గుర్తించి శాసన శబ్దమంజరి పేరిట రెండు పుస్తకాలను వెలువరించారు. 1981 వరకూ ప్రచురితమైన కాకతీయ శాసనాలనుక్షుణ్ణంగా పరిశీలించిన పరబ్రహ్మశాస్త్రిగారు, శాసన రచయితలైన కవులను, శాసనాల్లో కావ్యాలనూ గుర్తించి, కాకతీయ శాసన సాహిత్యము అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో, కాకతీయ రుద్రదేవుని వేయిస్థంభాల గుడి (క్రీ.శ. 1163) శాసనాన్ని విద్వాంసుడైన అచింతేంద్రయతి అనే కవి, మృదు మధుర పదభూయిష్టమైన కావ్యంగా రాశాడన్నారు. రుద్రుని కాలంనాటి అనుమకొండ, నగునూరు శాసనాలను వేయించిన గంగాధరమంత్రి శాసనాలను, బెక్కల్లు శాసనాన్ని నాగదేవకవి వసంత తిలకావృత్తంలో రచించాడని చెప్పారు. గణపతి దేవుని శాసనాలు ఖండకావ్యాలను పోలి ఉంటాయనీ, వాటి రచయితల్లో ఆయన ఆస్థాన కవి. కవిచక్రవర్తి నృత్యరత్నావళి రచయిత జాయపసేనానిని 'కవిశ్రేష్టుండనీ, సకలనాట్యవైదిక గ్రామణి, కవిసభాశిఖామణి' అని కొనియాడాడని శాస్త్రిగారి పరిశోధనలో వెల్లడైంది.

పాలంపేటలోని రామప్పదేవాలయ శాసన రచయిత ఎవరో తెలియదుగానీ, రేచర్ల రుద్రిరెడ్డి క్రీ.శ.1213లో వేయించిన ఆ శాసనమొక కావ్యమని, ఆ కవి వర్ణనా వైశిష్ట్యాన్ని వివరించారు పరబ్రహ్మశాస్త్రిగారు. కొండపర్తిలోని మల్యాలచౌండసేనాని, కాటచమూపతి, వారి భార్యలు మైలమ, నాచాంబికలు వేయించిన శాసనాలను పరిశీలించి, వారి గుణగణాలు, ఆలయ నిర్మాణ విశేషాలతో పాటు, శిల్పుల సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారిగా శాస్త్రిగారే తెలియజేశారు.

గణపతిదేవుని సైన్యాధిపతి మల్యాలగుండయ, అతని భార్య కుప్పాంబిక వేయించిన వర్థమానపురం (నందివడ్డెమాను), బూదపురం (భూత్‌పూర్) శాసనాలను మయూరసూరి అలంకారయుక్తంగా రచించాడనీ, అతనికి పదవాక్యప్రమాణప్రమేయ, విచిత్రకవిత్వతత్వజ్ఞుడనే బిరుదులున్నాయని చెప్పారు.

గణపతిదేవుని సోదరి కుందమాంబ వేయించిన కుందారం, నిడిగొండ శాసనాలను బాలభారతి కవి పదలాలిత్యంతో ద్రాక్షపాకంలా రచించాడన్నారు. గణపతిదేవ, రుద్రమదేవి కాలపు త్రిపురాంతకం, కాళేశ్వరం, చంద్రవల్లి శాసనాలను కాకతీయ రాజగురువైన విశ్వేరశివాచార్యుడే రాసి ఉంటాడని, అతడు, సంస్కృత శ్లోకాలనేకాక, గద్యాన్ని కూడ హృద్యంగా రాయగలడని శాస్త్రిగారు పేర్కొన్నారు.

త్రిభువన విద్యాచక్రవర్తి బిరుదాంకితుడైన గణపతిదేవుని మరో ఆస్థానకవి మంచి

16