ఏనుగులకు తాను సింహంలాంటి వాడని శాస్త్రి గారు అంతటితో ఊరుకోకుండా, శాసనాల్లో ఇలాంటి బిరుదుందేమోనని వెదకటం ప్రారంభించారు. మాచర్ల దగ్గర గల తేరాల శాసనంలో ప్రతాప రుద్రుని 'దాయ గజకేసరి లాంఛన భ్రాజితుండు' అని కీర్తించటాన్ని గుర్తించి, ఇది ప్రతాపరుద్రుని అధికార రాజరిక బిరుదని నిర్ణయించారు. అంతేకాక, కాకతీయవంశంలోని రెండో ప్రోలరాజు, రుద్రదేవ మహారాజు, గణపతి దేవమహారాజులకు కూడ ఈ 'రాయగజకేసరి' బిరుదున్నట్లుగా, రుద్రమదేవి, యాదవులనుంచి బీదరుకోటను సాధించి, 'రాయగజకేసరి' బిరుదును ధరించినట్లుగా కూడా పరబ్రహ్మశాస్త్రి తెలియజేశారు.
స్టేట్‌మ్యూజియంలోని కొన్ని వెండి రూకలు, బంగారుద్రమ్మలనే నాణేలపై గల'రాయగజకేసరి', 'దాయగజకేసరి' బిరుదులను బట్టి అవి చాళుక్యుల నాణేలని పూర్వం కొందరు పరిశోధకులు పేర్కొనగా, శాస్త్రిగారు ఇవి కాకతీయుల నాణేలని కాకతీయ కాయిన్స్ అండ్ మెజర్స్ అన్న పుస్తకం ద్వారా 1975లో తప్పును సరిదిద్దారు.
క్రీ.శ. 1289లో కాకతీయ రుద్రమదేవి యుద్ధభూమిలో మరణించిందన్న విషయాన్ని 'డిడ్ కాకతిరుద్రమదేవి డై ఆన్ బాటిల్ ఫీల్డ్ ?' అన్న వ్యాసం ద్వారా 1974లో తెలియజేశారు. అప్పటి వరకూ జరిగిన పరిశోధనల నేపథ్యంలో తాను కనుగొన్న శాసనాధారాలతో కలిపి 'కాకతీయులు' అన్న అంశంపై 1976లో ధార్వాడ్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి పీహెడ్‌డీ పట్టాను పొంది, ఆంగ్లంలో కాకతీయాస్ ఆఫ్ వరంగల్ అన్న పుస్తకాన్ని 1977లో ప్రచురించి తెలుగు వారి చరిత్రను సుసంపన్నం చేశారు.
ఆమరణ పరిశోధన
పరబ్రహ్మశాస్త్రి గారు 1977లో పురావస్తుశాఖలో శాసన విభాగంలో డెప్యూటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తరువాత అందరిలా ఆయన కూడ పరిశోధనను పక్కన బెడతారనుకొన్న అపోహకు తావివ్వలేదు శాస్త్రిగారు. శాసన పరిశోధన, రచనలను మునుపటికంటే ఇంకా ముమ్మరం చేశారు. కార్యభారం వల్ల ఆయన, పదవిలో ఉండగా 9 వ్యాసాలు, 6 పుస్తకాలు మాత్రమే రాయగా, పదవీ విరమణ తరువాత, 60 వ్యాసాలు, 15 పుస్తకాలను రాయటమే కాక, సలహాదారుగా అనేక పుస్తకాల ప్రచురణలో ప్రముఖ పాత్రను పోషించారు.
శాతవాహన చరిత్రను తిరగరాసిన శాస్త్రిగారు
కారణజన్ములనే మాట ఊరికే పుట్టలేదు. శాస్త్రిగారి విషయంలో అది నిజమేననిపించింది. ఉద్యోగరీత్యా 1975లో, ఆయన కన్నడ రచయిత పంపమహాకవిని గురించి లోతైన పరిశోధన చేయాలనుకొన్నారు. సమాచార సేకరణలో భాగంగా,
4