Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తశాసనకర్త యగుసోమనప్రెగ్గడ యాదత్తామాత్యునికొడుకని తలంచినచో నీశాసనకాలము 1110 (1085 + 25) అని యూహింపవచ్చును. South Indian Inscriptions Vol. IV. No. 1180)

శా.

భారద్వాజపవిత్రగోత్రుణ్డు జగప్రఖ్యాతిగాం బెట్టెం భూ
(హారా)భుం డ్డొరగాండివల్లభుండు దత్తామాత్యసోముణ్డు దా
క్షారామప్రముఖోల్లసత్ప్రకటపంచారామతీర్త్థంబులను
సారాఖణ్డదశాప్తదీపకము లాచంద్రార్క్కతారంబుగాన్.

1


ఉ.

దానదధీచి సోముం డవదాతయశఃప్రసారుణ్డు[1] పుత్రసం
తాన(స)మృద్ధుండై చెఱ్వు[2] ధర్మ్మవివాహము దేవగేహ(ము)
... వనము[3] సత్ప్రబంధము నిధాన మనంజనుచున్న సప్తసం
తానములుం బ్రసిద్ధముగ ధారుణిపై నిలిపెం గ్రామంబునన్.

2

—————

54

శ. స. 1122

(ఈశాసనము గుంటూరుమండలమునం దమరావతిగ్రామములో అమరేశ్వరుని యాలయమునకు వెలుపల తూర్పుదిక్కునఁ బాఁతియున్న యొకఱాతిపలకమీఁద నున్నది. South Indian Inscriptions Vol. VI. No. 216.)

మొదటివైపు

ఉ.

శ్రీపరమేష్ఠిపాదసరసీరుహయుగ్మమునందు సంభవం
బై పరగెం జ్జతుర్త్థకుల మందులం బుట్టిరి భూరికీర్త్తు లు
(ద్దీపిత)ధర్మ్మచిత్తు లినతేజు లనేకులు సద్గు(ణ)....౦
దీపుడమిం బ్రసిద్ధముగ నెఱ్ఱమనాయకుం డున్నతస్థితిన్.

1
  1. ప్రసరుణ్డు
  2. చెఱువు
  3. ముద్యానము