Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

శ. క. 1087

(ఇవి గుంటూరుమండలములో సత్తెనపల్లితాలూకాలోని సిరిపురగ్రామమందు మూలస్థానరామేశ్వరాలయములో నొకఱాతిమీఁది శాసనములోని పద్యములు. కొన్నిసంస్కృతపద్యములపిదప నీతెనుఁగుపద్యము లున్నవి. నాయొద్ద నున్నప్రతిబింబపుఁగాగితము కొంచెము శిథిల మైనది. Government Epigraphist's Collection No. 49 of 1909.)

మ.

సకలోర్వ్వీజనరక్షణక్షము దశాశాపూర్న్నకీర్త్తీలతా
ప్రకటున్ ......దుర్జ్యయకులప్రాకారు సత్యవ్రతు
న్సుకవీంద్రామరభూజమున్ (బ)డిగులార్జ్జును వీరరాజేంద్రచో
డికుమారుం బ్రణుతింపరే శుభటకంటీరు[1] న్నుదారుం బ్రభున్.

1


చ.

ఇల వె(ల)నాంటిగోంక్కవసుధేశుతనూ(భవు)౦డైన ... భూ
తలపతి సోడపట్ట... దంబునం(గ) భుజాబలంబు(నం)
(గొలను జ)యించ్చి యంద్దు (రి)పుకుంజరు భీమనిం జంపి ఆంధ్రభూ[2]
తలము పదాఱువేలు సతత........లీలన్.

2

—————

49

శ. స. 1090

(ఈశాసనము గోదావరీమండలములో దాక్షారామగ్రామమందు భీమేశ్వరాలయము గోడమీఁద చెక్కఁబడియున్నది. ఇది మిక్కిలి పెద్దపద్యశాసనము కాని, చాలభాగము ఖిలమై పోయినది. Suth Indian Inscriptions Vol. IV. No. 1039.)

ఉ.

.............................సత్కవీంద్ర సం
తానము వైరివారిదసదాగతి బంధునిధానుం డన్వయం

  1. సుభటకంఠీరవున్ - అని భావము కావచ్చును.
  2. యాంధ్ర