Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

శ. స. 1085

(ఈశాసనము గుంటూరుమండలములో నరసారావుపేటతాలూకా చేజెర్లగ్రామమందు శ్రీకపోతేశ్వరస్వామిగుడిలో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 598.)

సీ.

స్వస్తి శతాబ్దములు శరగజదిక్సంఖ్య
            విదితసుభాను[1]సంవత్సరమున
పౌష్యమాసంబున బహులపంచాదశి
            నమరేంద్రగురువాసరమునం బరగి
యతిశయం బగునుత్తరాయనసంక్రాన్తి
            నఖలలోకేశ్వరుం డనంగ నొప్పి
నాలుగువేలును నన్నూటనలువది
            నాల్గులింగంబులనడుమ నెలసి
సిద్ధవంద్యుం డైనచేంజెఱువులకపో
తీశ్వరునకు భక్తి శాశ్వతముగ
మనుమకులుండైన తాడూరిఘనుండు మార
మాంబకేతం డఖణ్డదీపంబు నిలిపె[2].

—————

  1. "వరలుస్వభాను" అని యుండవలయును.
  2. ఈయెత్తుగీతిలో మొదటివి రెండు నాటవెలఁదిపాదములు, చివరవి రెండును దేటగీతపాదములు.