|
(చె)ఱ్వుల[1] భీమనాథునకుం జెలువుగ[2] నిల్పె నఖండదీపకం
బె(ఱుకు)వమంత్రి నల్లండు ది(నే)శసుధాకరకతారకంబుగాను.
| 3
|
స్వస్తి |
సక[3]వర్షంబులు 1081 గు నేంటి కన్యసంక్రాంత్తినిమి
త్తమున శ్రీమన్మహామండలేశ్వర కన్నరదేవచోడ(మ)హారాజుల పెగ్గ
డ నల్లపెగ్గడ కంచెఱ్వులభీమేశ్వరదేవరకు సఖండదీపమునకు నిచ్చిన
మొదవులు పండ్రెండు వీనిని బయింబెట్టుకొని యొడయరి యాచంద్ర
తారకముగాం దనపుత్రానుపవుత్రికమున[4] నిత్యమానెండు నెయి వో
యుగ్గలవారు.
|
|
44
(ఈశాసనము గుంటూరుమండలములో బాపట్లగ్రామమందు శ్రీభావనారాయణస్వామిగుడి గోడమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 181.)
క. |
అనుపమ మగుబండారము
ననఘం బగు నబ్ధవిగ్రహి ...... బె
క్కుని(యోగ)౦బులుం దేజము
గొనకొని వడసిన యమాత్యకొమ్మండు వ్రీతిని.
| 1
|
చ. |
కరగజకేందు[5]సంఖ్య శకకాలము వొల్పుగ భావపట్టు(దే
వరని) నఖండదీప మతిభాసురలీల వెలుంగ నిల్పె వి
స్తరమతిం దల్లిదండ్రులకు ధర్మ్మువుగా శశితారకంబుగా
గురుభుజుం డిద్ధవిక్రముండుం గొమ్మనపెర్గ్గడ ధన్యుం డున్నతిని.
| 2
|
- ↑ చెఱువుల
- ↑ జెల్వుగ
- ↑ శక
- ↑ పౌత్రికమునం
- ↑ ఖేందు