Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బేర్మ్మితోడం గరము ధర్మ్మువు గాంగ న
ఖండదీప మఖిలమండనముగ
నిలిపె వంశమెల్ల వెలుగంగ నాచంద్ర
తారకంబుగాంగ ధాత్రి మింద[1].

5

—————

41

శ. స. 1080

(ఈశాసనము గుంటూరుమండలములో అమరావతిగ్రామమందు అమరేశ్వరస్వామియాలయమునం దుత్తరద్వారమునొద్ద నున్న చిన్నమండపములో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. VI. Nos. 233, 234 and 235.)

శా.

శ్రీకాంతానిలయంబు శిష్టజనతాసేవ్యంబు శాలీవనా
నీకప్రాంత్తజలాశయోద్గతలసన్నీరేజశోభాన్వితం
బాకీర్న్నద్విజనంద్దనంబు రమణియ్య[2]స్థానమై కమ్మలో
నాకాధీశపురంబుకంటె నిది మేలునా నొప్పు రాయూ రిలను.

1


ఉ.

రాజితకీర్త్తు లట్టి యకరంబునం[3] గమ్మకులోద్భవులు భర
ద్వాజమునీంద్రగోత్రజులు పలువురు[4] వారలలోన సద్గుణ
భ్రాజితకీర్త్తి గంట్టెన ప్రభావసమన్వితుం దుద్భవించెం దే
జోజయశాలి సూంద్రితవచోనిధి బంధుజనాశ్రయుం డనను.

2


క.కందం॥

సాధులకంద్దర్ప్పుండనను
సాధుజనానంద్దకరుండు సననతనికి నం
భోధిగభీరుం డన నా
రాధితశంక్కరుండు దేవరా జుదియించ్చెను[5].

3
  1. మింద = మీఁద
  2. రమణీయా
  3. అకరమన - కరరహితమైన యగ్రహారమా?
  4. పల్వురు
  5. రా జుదయించ్చెను