Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హితమితభాషి గేత(౦) డుదియించ్చె[1] సమస్తజనానురాగు(౦) డై
శతమఖభోగి వాని అనుజన్ముండు[2] విద్దనమల్ల(౦) డున్నతిని.

3


స్వస్తి శ్రీశకవర్షములు 1073 గు నేంటి ఉత్తరాయన
సంక్రాంత్తినిమిత్తమున శ్రీమన్మహామండలేశ్వర త్రిభువనమల్లదేవ పొ
త్తపి(చోడ)మహారాజుల(రాజా)ధ్యక్ష విద్దనపెగ్గడకొడ్కు మల్లయపెగ్గడ
కమ్మనాంటిలోని ప్రేంపల్లి భావనారాయణ దేవర కాచంద్రార్క్క మ
ఖండవర్త్తిదీపమునకుం బెట్టిన బిరుదుమాడలు (12) ౼ ఇత్యాది.

౼౼౼౼౼

35

శ. స. 1074

(ఈశాసనము కృష్ణామండలములో అవనిగడ్డగ్రామమందు లక్ష్మీనారాయణస్వామి యాలయములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 945. See No. 943)

క.

శ్రీరమణియు రణవిజయ
శ్రీరమణియు నిందుకుందసితవిపులయశ(ః)
శ్రీరమణియు వరియింత్తురు
(గో)రి కులోత్తుంగచోడగొంక్కనరేంద్రున్.

1


ఉ.

ఆరయ నట్టిగొంక్క నిపునన్వయ భిత్యుండ్డు వి(శ్వ)శాసన
శ్రీరమణీయమై తనరం జింతమనాయకు డుద్ధరించెం గొ
ల్లూరివిభుండు వంశమహిమోన్నతు లన్నియు నేర్ప్పడం బ్రతీ
హారిపదార్త్థపూర్వ్వముగ నారవితారకశాసనంబుగాన్.

2


క.

అతనికి నగణ్యపుణ్య
వ్రతయగు గుండమకుం బుట్టె వసుమతి వీర

  1. డుదయించ్చె
  2. వానియనుజన్ముండు