33
(ఈశాసనము గుంటూరుమండలములో నరసారావుపేఁట తాలూకాలోని చెన్నుపల్లి అగ్రహారమందు పశ్చిమపుదిక్కున పరసవేదీశ్వరస్వామి యాలయమం దొకశిలాస్తంభముమీఁద చెక్కఁబడియున్నది.)
సీ. |
శ్రీకుబేరాన్వయశఖురుం[1] డనఘుండు
వాసయసెట్టికి వనజపత్ర
నేత్రి దండ్యమకు సుపుత్రుండు గొసనయ
సెట్టి గొట్టియదొనం జెఱువు గుడియుం
గట్టించి పరివారగణసహితముగ సో
మేశ్వరదేవర సాశ్వతముగ[2]
నిలిపి తటాకంబు మలపించి వ్రిత్తులు
మానులకును గుడిసానులకును
నట్టవోజులకునుం బెట్టుచ హవిబలి[3]
యర్చ్చనలకు మేలియమదునకును
దేవభోగముగను దేవర కాచంద్ర
తారకముగం జెఱువు నూరు నిచ్చె.
| 1
|
క. |
శ్రీవైశ్యవంశవర్ద్ధనుం
డీవసుమతిం గొసనిసెట్టి యీశ్వరునకు గౌ
రీవరునకు సోమేశ్వర
దేవర కొప్పంగ నఖండదీపము నిలిపెను.
| 2
|
- ↑ శేఖరుం
- ↑ శాశ్వతముగ
- ↑ "బెట్టిహవిర్బలి" అని యుండనోపు.