Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్రిభువనాధిపున కెత్తించె నఖణ్డ
            దీపంబు కేశవదేవర కొప్ప.

1


చ.

ఇల నమరాద్రినాథునకు నల్ల[1] మహీపతి కి(ద్ధ)కీర్త్తికిం
బొలుపుగ వెన్నమాంబికకుఁ బుట్టిన లక్షణి గామిదేవి మి
క్కిలి సిరిసంతతిం బడసి కేశవదేవరకును ముదంబుతో
నిలిపె నఖణ్ణదీప మొగి నింగి శశులు గలయంత్తగాలమును.

2

—————

24

శ. స. 1070

(ఇది గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందలి శంకరేశ్వరస్వామి యాలయమునం దొకఱాతిస్తంభముమీఁద నున్న యొకశాసనములోని చివరభాగము — Government Epigraphist's Collection No. 169 of 1899.)

క.

ఖమునివియత్శశిమితశక
సమములం దనరంగ విషువుసంక్రాన్తినిమి
త్తమున సితకీర్త్తి భైరయ
గొమరుగ భీమేశ్వరునకు గుడి యెత్తించెను.

1


శకవర్షములు 1070 గు నేణ్టి చైత్రబహుల 15 యు మం
గ్గళవారము సూర్య్యగ్రహణనిమిత్తమున సాదముభైరయ గొట్యదొ
నభీమేశ్వరమహాదేవరకు అఖణ్ణదీపములు రెణ్టికి నిచ్చిన ఎడ్లు 100
వీనిం జేకొని భీమేశ్వరమహాదేవర దీవియకాంపు లైన కేతబోయుణ్డును
నల్లబోయుణ్డును రె ణ్డఖణ్డదీపములకు నిత్యఅడ్డెండు నెయి ఆచంద్రా
ర్క్కముం బోయంగ్గలవారు॥

  1. యతి చెడినది - నెల్లమహీపతి యని యుండనోపు.