Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

శ. స. 1067

(ఈశాసనము గుంటూరుమండలమందు, చేబ్రోలుగ్రామములో నాగేశ్వరస్వామియాలయములో నొకశిలాస్తంభముమీఁద చెక్కఁబడియున్నది — South Indian Inscriptions Vol. VI. No. 103.)

శా.

శ్రీనారీపతినాభిపంక్కజభవశ్రీపాదజాతోత్తమ
క్ష్మానాథాంబుజభాస్కరుండ్డు నిజవంశం బెల్ల దీపింప్పంగా
దీనానాథకవీంద్రగాయకులు గీర్త్తింప్పంగ్గం గీర్త్తీశుం డై
భూనాథాగ్రణి బుద్ధవర్మ్మ ప్రభతోం బుట్టె న్మహాశౌర్య్యుండై.

1


స్రగ్ధర.

శ్రీరమ్యక్ష్మావధూకాం
            చ్చికి నెనయగు కాంచ్చీపురీనాథు నుగ్రా
కారును లాలాటనేత్రుం
            గ్గవిజనహితు ముక్కంటికాడ్వెట్టిం బుణ్యా
చారుం ద్దద్భుద్ధవర్మ్మే
            శ్వరుండు గొలిచి మునుశాసనం బ్బొందంగర్న్నో
దారుం డ్డొంగేఱుమార్గ్గ
            త్రయము వడసె నాతారచంద్ద్రార్క్కలీలను.

2


ఉ.

ఆవిభునస్వయంబ్బున గుణాఢ్యుండు గండ్డండు పుట్టె వానికిని
దేవమహీజదాని అగు[1] దేసటిపండ్డండు పుట్టి షట్సహ
స్స్రావని ఏలెం[2] తత్సుతుం డుదగ్గ్రుండు విల్లమభీమం డంధ్రల
క్ష్మీవనితేశుచేం బడసెం జెల్వగు పంచ్చినికుఱ్ఱు వ్రిత్తిగాను.

3


ఉ.

అతని కుద్భవించ్చె నధిపాగ్రణి గండ్డండు వానికిం గ్గుల
స్త్రీతిలకంబు మేడమకు ధీరుండు వండ్డండు పుట్టె వానికిని

  1. యగు
  2. యేలెం