Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

శ. స. 1061

(ఈశాసనము గుంటూరుమండలములో నాదెళ్లగ్రామమందు మూలస్థానేశ్వరాలయములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడి యున్నది. South Indian Inscriptions Vol. IV. No 672.)

ఉ.

హారతుషారశంఖవిమలాభ్రమహోజ్వలకీర్త్తిం జాలం బొ
ల్పారిన బుద్దమండలికు నగ్రసుతుం డగుమన్నమండం డా
చారపరుండు నాదెండ్లం[1] జారుతరం బగువెండికొండ నాం
గోరి శశాంక్కమాలికి విగుర్వ్వునతో[2] గుడి నిల్పె భక్తునను[3].

1


చ.

గడియమదేవిన౦ద్దనుం డగన్య[4]గుణాకరధర్మ్మశీలుం డి
ప్పుడమి వెలుంగు నొంచెడ్లపూడి[5]మహేశున కిందుమౌలికిం
గడు ననురాగ[6]చిత్తమునం గల్లి నిజం బగుచుండ నిచ్చె నీ
జడనిధులుం దివాకరుండు జంద్రుండునుం గలయంతగాలమును.

2


ఉ.

మేరుగుణావతారుం డగుమేడనికిం గలుహారగన్ధి అం
భోరుహ[7]నేత్రి అన్వయ[8]విభూషణి నాందగు మేడమాంబకునుం
గారవలీలం బుట్టి గుణగౌరవసంపద విస్తరిల్లి గా
న్ధారికి సీతకు న్శచికిం దా నధికం బని బ్రస్తుతింప్పం[9]గాను.

3
  1. నాదెడలం
  2. విగుర్వ్వునతో అనునది సాధువుగాఁ గాన్పింపదు; విగుర్వ్వు శబ్దమైనచో నకారమునకుఁ బ్రసక్తి లేదు. విగుర్వ్వణశబ్దమైనచో విగుర్వ్వణముతో నని యుండవలయును.
  3. భక్తినిన్
  4. గణ్య
  5. నొంచెడలపూండి
  6. అనురాగ = అనురాగము. ఈశబ్దమును జరిత్రాదిగణములోఁ జేర్చినదో మువర్ణలోపము సిద్ధించును.
  7. యంభోరుహ
  8. యన్వయ
  9. ప్రస్తుతింప - అని యుండవలయును.