Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

శ. క. 1061

(ఈశాసనము గుంటూరిమండలములో నాదెళ్లగ్రామమందు మూలస్థానేశ్వరాలయములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 666.)

శా.

శ్రీలోలుండు వడాలుకాటనికి రాజీవాక్షి సూరాంబనాం
గా లీలం జ్జెనియించెం[1] దత్సతికి విఖ్యాతప్రభాభాసి గో
త్రాలంక్కారుండు దారిబుద్దనకునుం ద్దత్పుత్రి నాదిండ్లను(న్)
మూలస్థానము శూలికి(న్సు)కృతమును మోదప్రసాదార్త్థి యై.

1


చ.

అమర శకాబ్దములు హిమకరాంగ్గవియత్శసి[2]సంఖ్యగాను బౌ
(ష్య)మున సీతేతరార్కతిథి శౌరిదినంబున[3] భక్తి యేర్ప్పడం .
గమలదళాక్షి వెన్నమ ప్రకాశముగాంగ నఖండదీపర
త్నము రచియించె నారవిసుధాకరతారక మై వెలుఁగంగాను.

2


స్వస్తి॥

శ్రీశకవర్షంబులు 1061 యగు నేంటి పౌష్యబ
హుల సప్తమి వడ్డవారమున వెన్నమ శ్రీనాది(౦)డ్లమూలస్థానమహా
దేవరకు నఖండవత్తిదీపమునకుం బెట్టిన గొఱియలు 55॥

  1. జనియించెఁ
  2. వియచ్ఛః
  3. సౌరిదినంబున