Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీకారణ్యమరుత్సఖులు బహుకలానిష్ణాతు లుద్యత్సిత
శ్లోకులు గేతణ్డుం దమ్ముబంగియు జగల్లుంఠాక[1]భంగప్రదులూ.

1


ఉ.

అందు గిరీ(శు)కంటె సుభటాగ్రని[2] అర్క్కజుకంటె దాని శ్రీ
నందనుకంట్టె రూపి సురనాతుని[3]కంటె విలాసు ణ్డాపగా
నంద్దనుకంటె శౌచి నలినప్రియుకంట్టెం బ్రతాపి దణ్డభి
న్నంద్దనుకంటె సూన్రితు ణ్డనం దగు బంగ్గి ధరాతలంబునను.

2


క.

ఆతమ్ముబంగ్లికిని రా
మాతిలకం బైనబాదమకు నయవినయా
న్వీతుణ్డు బొద్దణ్డు బుధసం
ప్రీతికరుణ్డైన తమ్ముభీముణ్డు ననంగ్గాను.

3


చ.

అతులితపుణ్యమూర్త్తు లభియాతి నిృపాలకభంగ్గదులు జగ
ద్ధితహితసచ్చరిత్రు లుదియించ్చిరి[4] అందునుం దమ్ముభీమ ణ్డూ
ర్జ్జితుణ్డై[5] సప్తసంతతులుం జేకొని నిల్పి ధరామరోత్తమ
ప్రతతికి నగ్రహారము ల(పా)రము లిచ్చె దయానుభా(వ)నను.

4


శా.

ఆదిం జెప్పంగంబడ్డధర్మ్మువులు ధర్మ్మారంభు ణ్డై చేసె వి
ద్యాదానంబు హిరణ్యదానమును భూదానంబు గోదానక
న్యాదానంబులు నాంగ్గం బూని మహిలోనను పుట్టపుంబట్టను
త్పాదించ్చె న్మఱి తమ్ముభీమ ణ్డొగి సత్రంబులు ప్రపలు వెక్కులును.

5

————

  1. లుంటాక
  2. సుభటాగ్రణి
  3. నాథుని
  4. లుదయించ్చిరి
  5. ర్జ్జితుణ్డయి