Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పం బమరేశ్వరార్ద్ధముగ బాలకి లోలవిశాలనేత్రి గొ
మ్మాంబిక నిల్పె భక్తిమతియై యెఱియాంబతనూజ వ్రీతితోను.

5


స్వస్తి సమస్తప్రశస్తిసహితం శ్రీమన్మహామణ్డలేశ్వరకులోత్తుంగ
చోడగొంక్కరాజుల దివ్యశ్రీపాదపద్మోపజీవి యైన సెజ్జప్రోలెనాయ
కుని పెణ్డ్లము విణ్ఠల కొమ్మాసాని శ్రీమదమరేశ్వరమహాదేవర కాచం
ద్రార్క్కతార మఖణ్డవర్త్తి దీపంబున కిచ్చిన గొఱియలు 55.

(ఇత్యాది)

————

6

శ. స. 1040

(ఈశాసనము గుంటూరుమండలములో చేబ్రోలుగ్రామమందు తురకవీథిలోఁ బడియున్న రాతిమీఁద చెక్కఁబడి యున్నది. South Indian Inscriptions Vol. VI. No. 117.} (ఈశాసనము గుంటూరుమండలములో చేబ్రోలుగ్రామమందు తురకవీథిలోఁ బడియున్న రాతిమీఁద చెక్కబడి యున్నది. South Indian Inscriptions Vol. VI. No. 117.)

సీ.

శకమహీపాలకసంవ(త్సరంబులు
            గ)గనాబ్ధివి(య)దిందు(గణ)నం దనర
వడి ... ... ... న్వరంబున మహా
            ద్వాద(శి)తిథి నుదితోదయుణ్డు
... ... ... సూద్రకప్రభృతులతోడి
            కులమువాడను కలితనమువాడు
మ(ణ్డ)భూపాలకు మహనీయ్య[1]సాంబ్రాజ్య[2]
            రాజ్యాభివృద్ధిపరా(య)నుండు
సూరం డ(తులశౌర్య్య)సారుణ్డు సేంబ్రోల
బర్హివాహనునకు భక్తి వెల(య)
... ... ... నఖణ్డదీపంబు నిల్పె నా
చంద్రతారకముగ రుంద్రయశుణ్డు.

1
  1. మహానీయ
  2. సామ్రాజ్య