పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఆర్య వర్యులారా ! పురాణములు, కావ్యములు, యక్షగానములు, ప్రబంధము, నవలలు, నాటకములు వలెనే శతకములు గూఁడ నాంధ్ర వాజ్మయమునందు వ్యక్తిత్వముగల యొక విభాగముగనున్నవి. మన ప్రాచీనశతకములను యెల్ల వారలల్లారుముద్దుగా నాదరించినట్లు పెక్కు నిదర్శనములు కనఁబకుచున్నవి. శతకములు పండిత పామగులకుఁ బఠ నార్హములై వివిధ విషయములను బోధించుచున్నవి. ఈ శతకములందు 1 భక్తి , 2 శృంగార,3 వేదాంత, 4 నీతి, 5 నిఘంటు,6 వైరాగ్య 7 శృంగారభక్తి, 8 శాస్త్రములను, భాగములుగలవు. ప్రతి శతకము నందును 100 గానీ, 108 గాని పద్యములుండును. కాని, ఈ శతకము నందు 303 పద్యములున్నవి. కారణ మేమనఁగా శాస్త్ర సంబంధ మగుటచే విషయము నంతయు వ్రాయవలయునుగదా!

కవులు తమ తమ గ్రామములందు వెలసిన దైవమును, సంబో ధనలు శతకములందుంచి వారికవిత్వమును సార్ధకము జేసుకొనుచున్నా రు. కావుననే యీకవి "శిఖినరసింహదేవుని” సంబోచియున్నాడు.

ఈ శతకమునకు నేను తాత్పర్యము వ్రాయనెంచి నాకు లభిం చిన ప్రతియందు తప్పులు కుప్పలుగా నుండుటవలన 1 శ్రీనివాస ముద్రాక్షరశాల యందు ముద్రించిన మిగుల ప్రాచీన ప్రతియు, 2 వ యెతి రాజు నాయుఁడుగారి శ్రీ గోపాల ముద్రాక్షరశాల యందు 1907 సం|| ముద్రించిన ప్రతియు, 3 బ్రహ్మశ్రీ వావిళ్ల రామస్వామి శాస్త్రులు వారు 1922 సం|| ముద్రించిన ప్రతియు, 4 వెస్టువార్డు అండు కంపెని వారు 1933 సం|| ముద్రించిన ప్రతియును, పరిశీలించి నాశక్త్యాను సారముగా సవరించి, తాత్పర్యమును వ్రాసియుంటిని. పాఠభేదము లుదహరించునపుడు పై నంబర్లు గల పుస్తకములకు బదులు వాటి ముందు వేసియున్న నంబర్ల నే సూచించియున్న వాఁడను.

దీనిలో కొన్ని దేశీయవదములకు నిఘంటువులందు సైతము అర్ధములు దొరకనందున నా విద్యాభివృద్ధికి పలువిధముల నన్ను