పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

33


క. భూజరవి వాసరంబులు,
   రాజన కాలంబుగౌళి § రాజాతికినిన్,
   దేజము శుభమని పెద్దల
   చేఁ జెప్పఁగఁ బడునుభువిని § శిఖినరి సింహా,101

తా. ఓ సరసింహస్వామి! క్షత్రియజాతి బల్లికి, ఆది, మంగళ
వారములు రాజసకాలములు, శుభకరము.

క. పోలున్ కోమటి బల్లికి,
   కాలము రాజసము తెలియఁ § గా బుధవారం
   బేలీలనగును, ధారుణి,
   శ్రీలోల కరాళవదన § శిఖినరసింహా.102

తా. ఓ శ్రీలోలా! నరసింహస్వామి! వైశ్యజాతి బల్లికి బుధవారము రాజసకాలము శుభకరము,

క. నాలుగవజాతి బల్లికి,
   కాలము తామసము నరయఁ § గను, శని దినమౌ
   వాలాయము శుభకరమగు
   శ్రీలోలా! నిశ్చయంబు § శిఖినరసింహా .103

తా. ఓ లక్ష్మీనరసింహా! శూద్రజాతి బల్లికి శనివారము తామసకాలము శుభప్రదము.

-: వారమూలందేర్పడు కాలములు:-

క. ఉదయాదిగఁ బదిగడియలు,
   పదపడి సాత్వికము నవల § పది రజసౌ ము
   ప్పది వఱకు తామసంబగుఁ
   జెదరక సతతఁబుఁ దెలియ § శిఖినరసింహా,104