పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

శ కు న శా స్త్ర ము


---:[1]బల్లి జాతులు:---

క. బల్లుల జాతులు తెలియఁగ
   తెల్లని యది బ్రహ్మజాతి § తిరమగునెఱుపౌ
   బల్లి యిల రాచజాతిగఁ
   జెల్లగఁదగు ధరణియందు § శిఖినరసింహా.98

క. కోమటి గుంపుల బల్లికి
   జామన చాయయగు శూద్ర § జాతికి నలుపౌ
   కామించి ఫలముఁ జెప్పఁగ,
   శ్రీమానిని హృద్విహార § శిఖినరసింహా,99

తా. లక్ష్మీనరసింహస్వామీ! బాహ్మణజాతి బల్లి తెల్లగాను,
క్షత్రియజాతి బల్లి యెఱ్ఱగాను, వైశ్యజాతి బల్లి చామనచాయగాను,
శూద్రజాతి బల్లి నల్లగాను ఉండును,
|

-: [2]బల్లిజాతులు కాలఫలములు:-

క. గురు శుక్ర సోమవారము,
   లరయఁగ మఱిసత్వకాల § మగుచుండుధరన్
   పరగఁగ బావన బల్లికి,
   చిరుయో బళగిరి విహార § శిఖినరసింహా,100


తా, ఓ చిరుయోబళగిరియందు విహరించే నరసింహస్వామీ!
బాహ్మణజాతి బల్లికి గురు, శుక), సోమ, వారము లందు, సాత్విక
కాలములు, శుభకరము.

  1. ఇది రెండు ప్రతులలో లేదు.
  2. ఇది రెండు ప్రతులలో లేదు.