పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

31

క. పొక్కిలికి దిగువఁబాకిన,
   నెక్కినఁ జుట్టినను పడిన § నేఫలమైనన్
   నొక్కివచింపఁ బ్రయాణము,
   చిక్కదు నలికిరి ఫలంబు § శిఖినరసింహా.95

తా. ఓ నరసింహస్వామీ! సలికండ్ల పాము బొడ్డునకు క్రింది భాగ
మునందు పాకినను, ఎక్కినను, చుట్టినను, పడినను, ప్రయాణము
జరుగదు.[1]

క. పొక్కిలిఁ బైన ముందటి
   పక్కన నెచ్చోటదిగిన § పాకిన జయమౌ,
   నెక్కినఁ దాఁకిన నాకిన,
   చిక్కులుగలవండ్రు బుధులు § శిఖినర సింహా.96

తా. ఓ నరసింహస్వామి ! నలికీచు, బొడ్డునకు పైన ముందరి
ప్రక్కను, ఎచ్చటనై నను దిగినను పాకినను జయమగును, ఎక్కినను,
తాకినను, నాకినను, చిక్కులు కలుగును.

క. వీపు పయిఁబడిన భాగ్యము,
   మూఁపు వయింబడినచో స్వ § వురమునువీడున్
   కాపురము చెడును ఱెక్కల
   శ్రీపతి నలికీచు పడిన § శిఖినరసింహా.97

తా. ఓ లక్ష్మీనరసింహస్వామి! నలికీచు, వీపు మీఁదఁబడిన
భాగ్యము, మూపుపై (బడిన తనగ్రామమువిడిచి పరగ్రామము చేరు
టయు, ఱెక్కల మీఁదపడిన కాపురము చెడుటయు,కలుగును.

  1. ఈఫలము లేగ్రంధమునందు కనబడుట లేదు