పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

30


క. [1] పాదముల సందులాభము,
   మేదిని కుడి పాదమైన § మేలగు ధనమున్ ,
   ఆది భయ మెడమ పదమున,
   [2] శ్రీదయితా! పిదపశుభము § శిఖి నరసింహా.92

తా. ఓ శ్రీవల్లభా! నరసింహస్వామి! తొండ పాదముల మధ్య
యందు పడిన లాభము, కుడిపాదమునందు పడిన ధనలాభము. ఎడమ
పొదమునందు పడిన మొదలు భయమును తరువాత శుభమునుగల్గును,

క. [3] పై కెగబ్రాకిన శుభమగు,
   చేకొని కిందికిని దిగిన § చేటగునెపుడున్
   దాఁకిన చుట్టిన మేలగు,
   శ్రీకరమగు తొండ పాటు § శిఖినరసింహా.93

తా. ఓ నరసింహస్వామీ ! తొండ దేహము మీఁదికెగబ్రాకి
నచో శుభమును, పై నుండి క్రిందికి దిగిన కీడును, తాకినను
చుట్టినను మేలును, కలుగును.

-:[4]సలికీచుపాటు ఫలము :-

క. నలికనుల పామనంగను,
   నలికిరియు ననంగ మఱియు § నలికీచనఁగా,
   నిలనుండు రక్తపుచ్ఛిక
   చెలఁగున్ నలుమూల లలరి § శిఖినరసింహా.94

ఓ నరసింహస్వామీ! నలికనులపాము, నలికిరి, నలికీచు,
రక్తపుచ్ఛిక, ఈ పేళ్లు నలికండ్ల పా మునకు చెప్పబడెను.
 

  1. పాదము నందువ లాభము,
  2. శ్రీదయితా తొండపాటు అని పాంతరములు,
  3. ఈపద్యము 2 ప్రతులలో లేదు
  4. నకీలీచు పాటుఫలము ప్రాతప్రతులు రెంటిలోను లేదు