పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శకునశాస్త్రము

9


-:దూ త ల క్ష ణ ము (చేష్టాశకునములు.):-

క. శ్రీకర శుభమశుభంబుల,
   కే కొలఁదిని [1] ప్రశ్నలోక | మేపను లైనన్ ,
   గైకొనెడు లక్షణంబులఁ
   జేకొని చూడంగ వలయు | శిఖినరసింహా. 22

తా. ఓ నరసింహస్వామి! ప్రశ్న లడుగుటకు వచ్చెడి పృచ్ఛ
కుల చేష్టల ననుసరించి శుభాశుభములు నిర్ణయించి చెప్పవచ్చును.

క. [2] నేస్తముగ వచ్చి మనుజులు
   మస్తకమును ముట్టిరేని | మానిత శుభమౌ
   గస్తి యగుందలఁ గోకిన,
   సిస్తౌఁగుడి చెవిని ముట్ట : శిఖినరసింహా. 23

ఆ. ఓ నరసింహస్వామి! ప్రశ్న మడుగుటకు వచ్చిన మను
ష్యులు, శిరస్సును తాకినచో శుభమగును. తలగోకిన కీడగును, కుడి
చెవి తాకినచో శుభమగును,

క. భ్రష్టమగు నెడమ చెవియును,
  గష్టము మరణంబు రెండు| కర్ణములంట
[3]న్నష్టమెడమ కన్నంటఁగ,
శ్రేష్టము కుడికన్ను ముట్ట | శిఖినరసింహా. 24

తా. ఓ నరసింహస్వామీ! దూత ఎడమచెవి తాకినచో
చెఱుపును, రెండు చెవులును తాకిననచో కష్టము, మరణమును,
ఎడమ కన్ను స్పృశించిన మేలును కలుగును.

  1. పృచ్ఛకోత్త "మేపను లైనన్ = పొఠాంతరము,
  2. సిస్తుగ వచ్చుచు మనుజులు పాఠాంతరము ,
  3. న్నష్టము నెడమక నంటఁగ పాఠాంతరము ,