పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

శకునశాస్త్రము'

క. శనివారము షష్ఠినిఁ జని,
   పని వడి రావణుఁడు సెడెను | బంధుసహితుఁ డై ,
   మనుజులు చెడు టబ్బురమా,
   చినయోబళగిరి విహార శిఖినరసింహా. 19

తా. చినయోబళగిరి యందు విహరించు యోనరసింహ
స్వామీ! షష్ఠి శనివారమునాఁడు రావణాసురుఁడు ప్రయాణము చేసి
బంధుమిత్రాదులతో నశించెను. కనుక మనుజులట్టి దినము నందు
ప్రయాణము చేసిన చెడుటబ్బురము కాదు. కావున మానవలయును.

క. ధర సప్త మిందు వారము,
   దొరయన్ జని భార్గవుండు | దోర్బలశ క్తిన్ ,
   సిరిబో నాడెను యితరుల
   సిరులెన్నఁ దృణంబుగాదె| శిఖినరసింహా' 20

తా. ఓనరసింహస్వామీ! పరశురాముఁడు సప్తమి సోమ
వారము నాఁడు బయలు దేరి, బాహుబలమును సంపదను పోగొట్టు
కొనెను. కావున, అట్టి దినంబుస ప్రయాణము చేసిన మనుజులు
చెడిపోవుదురు. కనుక ప్రయాణము, మానవలయును.

క. అష్టమి గురువారంబునఁ
   గష్టంబుల పాలఁబడిరి | గద పాండవులే,
   నష్టంబగు పైనంబుల,
[1]శ్రేష్ఠంబని చనఁగరాదు | శిఖనరసింహా, 21

తా. ఓ నరసింహస్వామీ! అష్టమి గురువారమునాడు
పాండవులు బయలు దేరి బహుకష్టములకు పాల్పడిరి. కావున, అట్టి
నష్టంబగు దినంబున మంచిదని ప్రయాణము చేయరాదు.

  1. 1 శ్రేష్టంబనరాదు జనులు, 2 శ్రేష్టంబనరాదు పనులు అని మూలములం
    దున్నవి. అతిసమంజసము గాలేరు.