పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శకునశాస్త్రము

7


క . బలిచక్రవర్తి యంతటి,
    బలుఁడే చెడిపోయెఁ దదియ | భార్గ[1] వునిదినం
    బుల, మానవు లిలఁ జెడరా ,
    చెలువులు పర దేశమునను | శిఖినరిసింహా. 16

తా. ఓనరసింహస్వామి! బలిచక్రవర్తి తదియ శుక్రవారము
రోజున ప్రయాణము చేసి ఓడిపోయెను. కావున మానవు లట్టిరోజున
ప్రయాణము చేసినచో పాడగుదురు.

క. శ్రీరాముఁ డిడుమలంబడె,
    వారక చవితియును భాను | వారముగూడన్ ,
    నేరక పయనంబై చని,
   శ్రీరామా యితరు లెంత | శిఖనరసింహా. 17

తా. ఓనరసింహస్వామీ! చవితి ఆదివారము నాఁడు శ్రీరా
ముఁడు ప్రయాణము చేసి బహుకష్టములు పడెను. కనుక యట్టి
దినంబులం దితరులు ప్రయాణము చేయ రాదు.

క. పంచమి గురువారము మే
   లెంచకఁ జని యర్జునుండు| నిలఁగష్టపడెన్ ,
   మంచిదిన మనుచుఁబోయినఁ
   జెంచులలోఁ గలుతురవని | శిఖనరసింహా. 18

తా. ఓనరసింహస్వామీ! వంచమి గురువారమునాడు అర్జు
నుఁడు ప్రయాణము చేసి కష్టపడెను. కాబట్టి యట్టిదినము మంచి
దని ప్రయాణము చేసినచో యడవులలో చెంచుల పాలగుదురు.
కావున, ప్రయాణము చేయ రాదు.

  1. భార్గవ పైనంబుల పొఠాంతరము