పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

6

శ కు న శా స్త్ర ము


క. [1]తలపట్టు బెట్టు తలయును,
   [2]తలనూనెయు నెఱ్ఱజడల ! తలవిరితలయున్
   యిలగని పయినముఁ బోయిన
   జెలువము నెడఁబాసి చనును | శిఖినరసింహా.14

తా. ఓ నరసింహా! తలకు పట్టువేసుకొన్న వాడు, చమురుతలతో నున్నవాడు, ఎఱ్ఱజడలు తలగలవాఁడు, విరబోసుకోన్న వెండ్రుకల తలవాఁడు, వీరలెదురైనచో ప్రయాణము బోయినవారికి గొప్పతనము తగ్గును.

-: ప్రయా ణ ది న ము లు :-

క. విదియాం గారమునఁ జని,
   పదపడి నలచక్రవర్తి బహు కష్టపడెన్ ,
   మదమునఁ బోయిన జనులకుఁ
   జిదిసిన దేహంబులగును ! శిఖి నరసింహా.15

తా. ఓనరసింహస్వామీ! విదియ మంగళవారము నాఁడు నలచక్రవర్తి ప్రయాణము చేసి బహుకష్టములు పడెను, కనుక, మానవులట్టి దినంబులందు ప్రయాణము చేసినచో క్షీణింతురు.

విశే:- 10, 12 పద్యము లిటీవల కల్పించిన వని తోచుచున్నవి. పైని వ్రాసిన పద్యము లలో 9ది లగా యితు 18 పద్యములవరకు మూడు ప్రతులలోను విశేషపద్య భేదములు గల్గియున్నవి. పూర్వప్రతులు రెంటిలోను 11 పద్యములే యున్నవి. క్రొత్త దానిలో 14 పద్యములున్నవి. ప్రాచీనప్రతుల లో నివి.

క. వినుసూతక మగుసతి జె, [3]ల్లని జడల కొత్త కడవ • విధవాసతియున్
   బెనుగాలి ధూళియెడనెడ, జినుకుల పైనంబు తగదు • శిఖినరసింహా.9

క. బాపం డొక్కఁడు కట్టెల, మోపును ముక్కిటియు మొండి, మొనసినపొగ , సం
   తాపము జగడము గలిగిన, శ్రీపతి పైనంబు దగదు • శిఖినరసింహా.10

  1. ఇలపట్టుఁబెట్టుతల.
  2. తెలిసిన పయనంబు పఠాంతరములు
  3. యతి భంగము.