వ్రత రత్నాకరము
8
శ్రితాః, ఆయాన్తు దేవపూజార్ధం దురితక్షయకారకాః. 4. గఙ్గేచ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ క్ సన్నిధిం కురు.
మంత్రము - ఆపోవా ఇదగ్ సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవఆపోన్న మాపో౽మృతమాపస్సమ్రాడాపో విరాడాపస్స్వరాడాపశ్ఛన్ధాపోజ్యోతీగ్ ష్యాపోయజూగ్ ష్యా పస్సత్యమాపస్సర్వా దేవతాఆపోభూర్భువస్సువరాపఓం.
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమణ్టప మాత్మానం సంప్రోక్ష్య (కలశమందలిజలమును చేతిలోఁ బోసుకొని, పూజకొఱకయిన వస్తువులమీఁదను, దేవుని మందసమునందును తననెత్తి నను జల్లుకొనవలసినది.)
_________
గ ణా థి ప తి పూ జ
గణానాంత్వాగణపతిగ్ం హవామ హేకవిం కవీనాముపమ శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభిస్సీదసాదనమ్ - మహాగణాధిపతిం ధ్యాయామి. మహాగణాధిపతిం ఆవాహయామి.
మహాగణాధిపతయే ఆసనం సమర్పయామి.
మహాగణాధిపతయే అర్ఘ్యం సమర్పయామి.
________________________________________________________________________________________ ముల నెల్లఁ బరిమార్చునట్టి యవి యెల్ల దేవపూజకొఱకు కలశమునందు వచ్చి చేరునుగాక 4. ఓగంగా దేవీ ! ఓయమునా దేవీ ! ఓగోదావరీ దేవీ ! ఓసరస్వతీ దేవీ ! ఓనర్మదా దేవీ ! ఓసింధు దేవీ ! ఓకావేరీ దేవీ ! మీరందఱీ కలశంబునఁ జేరుదురుఁగాక. -