వినాయక వ్రతము
7
ముద్దిశ్య, వరసిద్ధివినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.[1]
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే, తదంగత్వేన కలశ పూజాం కరిష్యే.[2]
కలశం గన్ధపుష్పాక్షతై రభ్యశ్చ్య (కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షతలద్ది లోపల నొక పుష్పము నుంచి) తదుపరి హస్తం నిధాయ (ఆ పాత్రమును చేతితో మూసిపెట్టి ఈ క్రింది మంత్రము సుచ్చరించి గంగాది నకలతీర్ణోదకములను కలశమునం దావాహనము చేయవలెను.)
1. కలశస్య ముఖే విష్ణుః కణ్ఠే రుద్రః సమాశ్రితః, మూలేతత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాస్మృతాః,
2. కుక్షౌతుసాగరాః సర్వే సప్తద్వీపా వసున్ధరా, ఋగ్వేదో౽థ యజుర్వేదః సామవేదో హ్యధర్వణః.
3. అఙ్గైశ్చసహితాః సర్వే కలశామ్బుసమా
1. కలశముయొక్క పైభాగమున విష్ణువును, గొంతుకడరుద్రుఁడును, అడుగున బ్రహ్మయు, నడుమ సప్తమాతృకలును, లోపల నేడుసముద్రములును, ఏడుద్వీపములును, భూమియు నున్నవి.
2. ఋగ్వేద, యజు ర్వేద, సామవేద, అధర్వణ వేదములును, శిక్షా వ్యాకరణ, ఛందో, నిరుక్త జ్యోతిషంబు లనెడి యాఱంగముల తోఁ గూడినవై కలశోదకము నాశ్రయించి యున్నవి. 3. పాప