పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68 వ్రతరత్నాకరము

విశ్రుతమ్. 31. ఏతత్తే సర్వమాఖ్యాతం వ్రతానాముత్తమం వ్రతం, య ఇదం శృణుయాద్వాపి శ్రావయేద్వా సమాహితః, సిద్ధ్యన్తి సర్వకార్యాణి వరలక్ష్మీ ప్రసాదతః. 32.

వరలక్ష్మీ వ్రతకథ

సకలమునిగణంబులతోఁ గూడి రమ్యమైయున్న కైలాసపర్వతశిఖరంబున నానావిధంబులగుమణులు చెక్కినదియ, పాటలములు, అశోకములు, సురపొన్నలు. ఖర్జూరములు, పొగడలు మొదలగు నెక్కు వృక్షములతోఁ గూడినదియునై, కుబేరుఁడు, వరణుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలురకును, నారదుఁడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టయి యుండుకల్పవృక్షపుఁ జేరువ, రత్నమయమైన సింహాసనమునందు నింపుగాఁ గూర్చుండియున్నట్టి జనులకు సుఖములఁ గలిగించువాఁడయిన శంకరునిఁ జూచి, పార్వతీదేవి కడుముదమంది “సకలలోకంబుల నేలుచు సకలభూతములందును దయగలిగియుండునట్టి యోనాథుఁడా! రహస్యమయి పావనమయిన యొక శుభ వ్రతంబును నాకుఁ దెల్పుము” అని లోకముల మేలుకోరినదై యడిగెను. అంతట నీశ్వరుఁడు పార్వతి కిట్లనియె. 'ఓపార్వతీ! వ్రతములలోనెల్ల నుత్తమ మయిన వ్రత మొక్కటి యున్నది. అది సకలసంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్ర పౌత్రులను ఒసఁగునది. ఈ పావనవ్రతము వరలక్ష్మీవ్రత మనఁబడును. వ్రతమును శ్రావణమాసంబునందు పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారమునాఁ డాచరింపవలెను. ఓ పార్వతీ! ఆవ్రతము చేసిన స్త్రీకిఁ గలుగు పుణ్యఫలంబుఁ జెప్పెదనాలకింపు" మని పార్వతికి పరమశివుఁడు చెప్పఁగా, నాపార్వతీదేవియు వెండియు శంకరుని