పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

63 వరలక్ష్మీ వ్రతము తా. ఓ దేవీ! నేతితోఁ దడిపిన వత్తులు వేసిన దీపమును వెలి. గించుచున్నాను. స్వీకరించి సంతోషపడుము. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం, నానాభక్ష్యఫలో వేతం గృహాణ హరివల్ల భే. ధూపదీపాన నగం ఆచమనీయం సమర్పయామి. తా, షడ సములుగలదియు, అనేకభక్ష్యములతోను, పండ్లతోనుగూడిన నై వేద్యమును బెట్టుచున్నాను. ఓవిష్ణుపత్నీ ! ఆరగింపుము. శ్రీవరలక్ష్మీ దేవతాయై నై వేద్యం సమర్పయామి. ఘనసారసుగనేన మి శ్రీతం పుష్పవానీతం, పొనీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహకమ్. తా. పచ్చకర్పూరపు తావితోను, పట్టివేళ్ల వాసనతోను, పువ్వుల వాసనతోను కూడినచల్ల నియుచకంబు పుచ్చుకొనుము. శ్రీవరలక్ష్మీ దేవతాయై పానీయం సమర్పయామీ, పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం, కర్పూరచూర్ణ సంయుక్తం తామ్బూలం ప్రతిగృహ్యతామ్. శ్రీవరలక్ష్మీ దేవతాయై తామ్బూలం సమర్పయామి. నీరాజనం సమానీతం కర్పూ రేణ సమన్వితం, తుభ్యం దాస్యామ్యహం - దేవి గృహ్యతాం విష్ణువల్ల భే. తా. ఓ దేవీ! విష్ణుపత్నీ ! కర్పూర నీరాజన మొసఁగు చున్నాను. గ్రహింపుము. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం దర్శయామి. నీరాజనాన మౌనం ఆచమనీయం సమర్పయామి. పదాసనే పద్మకరే సర్వలోకైక పూజితే,