సరస్వతీ వ్రతము 41
సరస్వతీ వ్రతము 41 బంగారు పాత్రములతోఁ దెచ్చి, సువాసన ద్రవ్యములు చేర్చిన శుద్ధజలములతో స్నానము చేయింపవలయును. శుక్లవస్త్రద్వయం దేవి కోమలం కుటిలాలకే, మయి ప్రీత్యా త్వయా వాణి బ్రహ్మాణి ప్రతిగృహ్యతామ్. సరస్వత్యై వస్త్రయుగ్మం సమర్పయామి. వంకరముంగురులు గల ఓబ్రహ్మదేవునిరాణీ! నేను రెండు తెల్లని వస్త్రములు నర్పించెద కైకొనుము. శబ్దబ్రహాతికే దేవి శబ్దశాస్త్రకృతాలయే, బ్రహ్మసూత్రం గృహాణ త్వం బ్రహ్మళ క్రాదిపూజితే. సరస్వత్యై యజ్ఞోపవీతం సమర్పయామి. వ్యాకరణ శాస్త్రమందు వసించుదానవు, ఇంద్రుఁడు మొదలగు దేవతలచేఁ గొనియాడఁబడుదానవు నైనశబ్ద బ్ర హ్మ స్వరూపురాలా! యజ్ఞోపవీతము నొసఁగుచున్నాను. గ్రహిం పుము. కటకముకుటహారై ర్నూపురైరంగ దాద్యై ర్వివిధసుమణియు కై రేఖలారత్న హారైః కమలదళవిలానే కామదే సంగృహిష్వ ప్రకటితకరుణా ర్తే భూరిశో భూషణాని సరస్వత్యై ఆభరణాని సమర్పయామి. ఎక్కువదయగలిగి, భక్తుల కోరికలనిచ్చు ఓ దేవీ! చేతి మురుగులు, కిరీటము, హారములు, అందెలు, వంకీలు, మొల సూళ్లు మొదలగు నవరత్నములు చెక్కిన పలుసొములను గ్రహింపుము.