పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీరస్తు

వ్రత రత్నాకరము

ప్రథమ భాగము.

వినాయక వ్రతము

ఆచమ్య. = ఆచమనము చేసి,[1]


శ్లో.

శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం,
సన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే.


అయం ముహూర్తః సుముహూర్తోఽ స్త్వితి భవన్తో మహాన్తోనుగృహ్ణన్తు=ఈముహూర్తము మంచి ముహర్తమగుఁగాక యని పూజ్యు లగు పెద్ద లనుగ్రహింతురుగాక. [2]

అయం ముహూర్తః సుముహూర్తోఽస్తు = ఈముహూర్తము శుభముహూర్త మగుఁగాక.[3]

  1. కర్త అచమనము చేయవలసినది. పిదప నమస్కారము చేయవలసినది, పెడిళ్లతో వెక్కిళ్లయందుఁ దాఁక వలసినది.
  2. ఈ వాక్యమును ప్రతము చేయువా రచ్చటనుండు బ్రాహణోత్తముల నడుగవలసినది.
  3. ఈవాక్యమును పురోహితుఁడు మొదలగు బ్రాహణోత్తములు బదులిడవలసినది.