ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సరస్వతీ వ్రతము
ఏవంగుణవి శేషణవిశిష్టాయామస్యాం శుభతిథౌ మమ (అస్మాకం) ధర్మార్థ కామమోక్షురూప చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సకలవిద్యాపారంగతత్వసిద్ధ్యర్థం చ వర్షే వర్షే వస్త్ర ప్రయుక్తాం శ్రీసరస్వతీదేవతా ముద్దిశ్య సరస్వతీదేవతా ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోప చార పూజాం కరిష్యే.[1]
అని సంకల్పము చేసి కలశపూజాదులను చేయవలెను
.
సరస్వతీ పూజా ప్రారంభము
శ్లో. (పుస్తకేషు యతో దేవీ క్రీడతే పరమార్థతః, తత స్తత్ర ప్రకుర్వీత థ్యానమావాహనాదికమ్.) ధ్యాన మేవం ప్రకుర్వీత సాధకో విజితేన్డియః, ప్రణవాసనమారూఢాం తదర్ధత్వేన నిశ్చితామ్. అఙ్కుశం చాక్షసూత్రంచ పాశం వీణాంచ ధారిణీం, ముక్తాహారసమాయుక్తాం 'మోదరూపాం మనోహరామ్.
- ↑ "శుక్లాంబరధరం" మొదలగు భగవద్ధ్యానము మొదటఁజేసి పిమ్మట పైరీతిగా సంకల్పము చేసి, ఆవల కలశపూజయు, గణాధిపతి పూజయు, ప్రాణ ప్రతిష్టయుఁ జేసి, పూజయారంభింపవలెను. భగవధ్యానము, సంకల్ప విధానము, గణాధిపతిపూజ, ప్రాణప్రతిష్ఠ వీనివిధానములను వినాయకవ్రతముఁ జూచి తెలిసికొనవలయును. గ్రంథము పెరుగు ననెడి హేతువుచే నవి యిచ్చట వాయఁబడలేదు.