పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

వ్రత రత్నాకరము

మణిని బడసెను. ఇంద్రుఁడు పూజించి వృతాసురునిసంహరించెను. రావణుఁడు సీతనెత్తుకొని పోయినప్పుడు, రాముఁడీ వ్రతము చేసి సీతను బడసెను. భగీరథుఁడు గంగ దెచ్చునపుడును దేవాసురు లమృతము పుట్టించునిమిత్తమును, సాంబుఁడు తన కుష్ఠరోగము తొలఁగునిమిత్తమును ఈగణనాథవ్రతము లాచ రించితమతమకోరికలను బడసిరి. ఇట్లు సూతమహాముని చెప్పఁగా ధర్మరాజావిధి ప్రకారము గణపతి పూజఁ గావించి, శత్రువులను సంహరించి, రాజ్యమును దనపరాక్రమమున సంపాదించుకొని సుఖంబుండెను. మనసులోఁ దలఁచిన కార్యములుగూడ జరుగు చుండును గనుకనే ఆవినాయకునికి సిద్ధివినాయకుఁడని పేరు ప్రసిద్దికి వచ్చినది. ఈగణనాథుని విద్య యారంభించునపుడు పూజించినయెడల విద్య బాగుగ వచ్చును. జయముగోరువాడు పూజ చేసిన జయమును పొందును. బిడ్డలుగోరువాఁడు పూజించిన బిడ్డలంగాంచును. మగని కోరుదానికి వయస్సుమగఁడు వచ్చును. సుమంగలి పూజించినయెడల సౌభాగ్యమును బొందును. విధవ పూజించినయెడలఁ బైజన్మకు విధవత్వము రానేరదు. బ్రాహణక్షత్రవైశ్యశూద్రు లనెడి నాలుగు వర్ణములవారును, స్త్రీలును, పిల్లవాండ్రునుగూడ యథావిధిగా నీ వ్రతము సేయవలయును. గణనాయకుని ప్రసాదమువలన నట్టిమనుష్యునికి సకల కార్యములు సిద్ధించును. పుత్రపౌత్రాభివృద్ధియు, ఏనుఁగులవఱకు నుండెడి కల్మియుఁ గలుగును అని పాండురాజపుత్రునికి సూత మహామునిచెప్పఁగా నతఁడట్లెచేసి సకలైశ్వర్యములనుబొందెను.

ఇది శ్రీస్కాందపురాణమున ఉమామహేశ్వరసంవాదమున వినాయక వ్రతకల్పము సంపూర్ణము.

————♦♦♦♦————