Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినాయక వ్రతము

35

చెఱకుగడలు, మఱి యనేకవిధము లగుభక్ష్యములు పండ్లును నైవేద్యము పెట్టి వినాయకునిసన్నిధిని నాట్యములుసల్పి, పాటలుపాడి పురాణపఠనము మొదలగు ఉపచారములచే వినాయకునిఁ దనివి నొందించి, వేదాధ్యయనపరు లయిన బ్రాహ్మణులకు వాయనదానంబుచేసి, పిమ్మట తానును తనబంధువులును మిత్రులును తృప్తిగా నూనె తగులకుండ భోజనము సలుపవలయును. ఈ ప్రకారము భక్తితో నీ వినాయక వ్రతంబు నాచరించువానికి బను లన్నియు సందేహము లేకుండ సిద్దింపఁ గలవు. ఆమఱుసటిదినము ఉదయమున నిద్ర లేచి, ముందటిదిన మందువలెనే సకలానుష్టానములను తీర్చుకొని గణనాయకునికి పునఃపూజ చేయవలయును. ఆదినమున నొక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతికై, ముంజదర్భ త్రాటిని, కృష్ణాజినమును, దండమును, యజ్ఞోపవీతమును, కమండలమును, వస్త్రమును తన శక్తికిఁ దగినట్లుగా నీయవలయును. పిమ్మటఁ దనపురోహితునికి శక్తికి లోపము లేకుండ ఉపాయన మియ్యవలెను, తక్కిన బ్రాహ ణులకును శక్తికొలఁది దక్షిణలిచ్చి, భోజనము పెట్టవలయును. ఇది వ్రతములలో నెల్ల నుత్తమవ్రతంబు. మూఁడులోకంబులందుసు బ్రసిద్ది చెందినది. ఈ వ్రతమును ముందటికల్పమున దేవతలుసు, మునులును, గంధర్వులును, కిన్నరులును, మఱి యనేకు లాచరించిరి. ఓధర రాజా! యీ ప్రకారము పరమశివుఁడు తన పుత్రుఁడయినకుమారస్వామి కుపదేశించెను. ఓధర్మరాజా! నీవుసు ఈ ప్రకారముగా గణపతి పూజ చేయుము. నీకు తప్పక జయంబు గలుగఁగలదు. నామాటనిక్కము. నిక్కము. నమ్ముము. ఈ వ్రతమును భూలోకమున నెందరోయాచరించిరి. ఈ వ్రతము చేసీ దమయంతి నలుని బడసెను. కృష్ణుఁ డాచరించి జాంబవతిని, స్యమంతక