Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

వ్రత రత్నాకరము

 
                        నాం చ వూజకాః,
   ఊర్ధ్వబాహనిరాలమ్బాః సర్వే ముని గణాస్తథా.

5. తాన్ పశ్యన్ ధర్మరాజో౽పి సంభ్రమేణ సమన్వితః.
   సూతాశ్రమం సమాసాద్య సూతం దృష్ణ్వా ససంభ్రమః,

6. నత్వా చ భార్యయా సార్థమనుజైః సముపావిశత్

తా. ఆవనమునం దచ్చటచ్చట బ్రహ్మవాదులయిన మునులు కూర్చుండియుండిరి. వారందఱు సూర్యుని, అగ్నిని బోలిన కాంతి గలవారును, వెలుగుల రాశింబోలిన వారును, గాలియు ఆకలములు నీరు మాత్రమే యాహారముగాఁ గలవారును, ఎల్లప్పు డగ్నిహోత్రములను జేయువారును, అతిథులను బూజించువారును, జేతులు పైకెత్తియు ఆధారము లేకయుఁ దపస్సు చేయువారును నైయుండిరి. ధర్మరాజు మునులందరిని జూచి మనస్సున సంతసము పడుచు సూతమహాముని యాశ్రమమునకుఁబోయి యమ్మునీంద్రునింజూచి తత్తరపాటుతో గూడిన వాడై, తాను భార్య తోను తమ్ములతోనుగూడ నమ్మునీంద్రునికి నమస్కరించి యాతని యాజ్ఞవడసి కూర్చుండి యామునీం ద్రులతో ని ట్లనియె,

ధర్మ ఉవాచ___ సూతసూత మహా ప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద.

7. వయం చ భార్యయా సార్ధం జ్ఞాతిభిః పరిపీడితాః,
   స్వరాజ్యం సకలం చైవ పుత్రాశ్చాపహృతా హి నః .

8. తన దర్శన మాత్రేణ సర్వం దుఃఖం వినాశితం,
   మమోపరి కృపాం కృత్వా వ్రతం బ్రూహి దయానిధే.

తా. “సకలశాస్త్రములను జదివిన గొప్పపండితుఁడవైన ఓ సూతమహామునీ! మాదాయాదు లగుకౌరవులు మాతో మోసపుజూదమాడి, మారాజ్యంబంతయు లాగికొని మమ్మును