28
వ్రత రత్నాకరము
1. వినాయకస్యప్రతిమాం వస్త్రయుగసమన్వితాం,
తుభ్యం దాస్యామి విప్రేన్ద్ర యథో క్తఫలదో భవ.
2. ప్రపీద దేవదేవేశ ప్రసీద గణనాయక, ప్రదక్షిణం కరోమీశపుత్ర విఘ్నేశ సర్వదా,
ప్రదక్షిణం కరోమి త్వా మమ త్వం సన్నిధౌ భవ.
3. యాని కాని చ పాపాని జనానుకృతాని చ,
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణపదేపదే .
4. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః,
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల
__________________________________________________________________________________________ ఓ దేవా! నీ వెల్లప్పుడు నా కార్యములను విఘ్నములు లేకుండ ననుకూలము చేయుము.
1. ఓ బ్రాహ్మణోత్తమా! ధోవతులజోడుతోఁగూడ వినాయకుని ప్రతిమను నీకు నొసంగుచున్నాను. శాస్త్రోక్తమైన ఫలము నొసఁగుము.[ఈశ్లోకమును జెప్పి వినాయకుని ప్రతిమాదానము చేయవలయును.]
2. ఓ దేవ దేవా! నాయం దనుగ్రహింపుము. పరమేశ్వరుని పుత్రుఁడా! ఓగణనాథా ! నీకుఁ బ్రదక్షిణం బొనర్చెదను. నాకుఁ బ్రత్యక్షమగుము.
3. నేను జన్మజన్మము లందుఁ జేసిన పాపకర్మంబు లన్నియుఁ బ్రదక్షిణము చేయు నొక్కొక్క యడుగునను దొలఁగుచున్నవి.
4. నేను పాపుఁడను, పాపపుఁబనులు సేయువాఁడను, పాపబుద్ధిగలవాఁడను, పాపముల కునికియైయుండువాడను. ఓ దేవా శరణు జొచ్చిన వారిని కాపాడు వాఁడా! నన్నుఁ గృపతోఁ గాపాడుము.