వినాయక వ్రతము
27
1 శ్లో. యం బ్రహ్మ వేదాన్తవిదో వదన్తి పరం ప్రధానం పురుషంతథాన్యే,
విశ్వోద్గతే: కారణమీశ్వరం వాతస్మై నమో విఘ్న వినాయకాయ,
2 శ్లో. నమస్తుభ్యం గణేశాన నమస్తే విఘ్న నాశన,
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిమ్.
3.శ్లో. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ,
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా,
ఇతి ప్రార్థనా అని వినాయకునిఁ బ్రార్థన చేయవలయును.
వాయనదానము.
శ్లో.గణేశః ప్రతిగృహ్లాతు గణేశో వై దదాతి చ,
గణేశస్తారకోభాభ్యాం గణేశాయ నమో నమః
(ఈ వాక్యమును వాయనమిచ్చువాడు చెప్పవలెను)
దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాంపూష్ణో హస్తాభ్యామాదదే
(ఈ మంత్రమును వాయనము పుచ్చుకొను వారు చెప్పవలెను.)
________________________________________________________________________________________
1. వేదాంతులు వినాయకుని బ్రహ్మమనియు, మఱికొందఱు ప్రపంచముయొక్క యుత్పత్తికి కారణభూతుఁడైన ప్రధాన పురుషుఁడనియుఁ జెప్పుదురు. అట్టివినాయకుని నమస్కరించు చున్నాను.
2 ఓగణాధిపా! విఘ్నములఁ బోగొట్టువాఁడా ! నీకు మ్రొక్కుచున్నాను. నాకుఁ గోరినకోర్కులను, పరలోక మున నుత్తమగతి నొసగుము. 3 ఎల్లపుడు కుడుములందుఁ బ్రియమైనవాఁడ వగు ఓ వినాయకా ! నీకు నమస్కారము.