పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

వ్రత రత్నాకరము

1 శ్లో. గణాధిప నమస్తే౽స్తు ఉమాపుత్రాఘనాశన,
      వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక
      ఏకదన్తైకవదన తథా మూషకవాహన,
      కుమారగురవే తుభ్యమర్పయామి సుమాఞ్జలిమ్.[1]

                            శ్రీవర... కాయ నమః మంత్రపుష్పం సమర్పయామి.

2 శ్లో. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ,
      నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన.
          
                            శ్రీవర... కాయనమః ఆత్మ ప్రదక్షిణనమస్కారాంత్సమర్పయామి.

3. శ్లో. అర్ఘ్యం గృహాణ హేరమ్బ సర్వభద్రప్రదాయక,
       గన్ధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన.[2]

                            శ్రీవర .. కాయనమః పునరర్ఘ్యం సమర్పయామీ.

________________________________________________________________________________________

1 ఓగణాధిపా! పార్వతికిఁ బుత్త్రుడా ! పాపముల నాశనము చేయువాఁడా ! పర మేశుని పుత్త్రుడా! అన్ని కోరికల నొసఁగు వాఁడా! ఒంటికొమ్ము వాఁడా! ఏకవదనుఁడా ! మూషకము నెక్కువాఁడా ! కుమారుని యన్న యగువాఁడా ! నీకు మంత్ర పుష్పము నర్పించుచున్నాను. 2 కుడుములందుఁ బ్రియుఁడా ! విఘ్నములఁబోగొట్టువాఁడా! ఎల్లప్పుడు నీకుఁ బ్రదక్షిణనమస్కారములు చేయుచున్నాను. 3. అందరికి మేలొసఁగువాఁడవు. పాపములఁ బోఁగొట్టువాఁడవు నైనవినాయకా! గంధపుష్పాక్షతలతోఁ గూడిన పాత్రమునందున్న యర్ఘ్యమును గ్రహింపుము.

  1. ఇక్కడ మంత్రపుష్పము చెప్పవచ్చును. ఆ మంత్రములు మంత్రపుష్పము అనుగ్రంథమునుండి తెలియవలెను.
  2. ఇట్లు 3 - 4 - 8 దానికంటే హెచ్చుమాఱులీ శ్లోకమును చెప్పి, యర్ఘ్యమును విడువ వలయును.