వినాయక వ్రతము
25
1 శ్లో. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ,
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక.
శ్రీవర... కాయ నమః సువర్ణ పుష్పం సమర్పయామి.
2 శ్లో. ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూకశకలై స్తథా,
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ.
శ్రీవర... కాయ నమః నీరాజనం దర్శయామి.
నీరాజనానన్తరం ఆచమనీయం సమర్పయామి. .
మంత్రము___ హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోపానీతి, ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజోదధాతి.
అథ దూర్వాయుగ్మ (=గరికెపోచలు) పూజా. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి “దూర్వాయుగ్మం పూజయామి” అని ప్రతి నామము వెంబడిఁ జేర్పవలయును,
గణాధిపాయ నమః || సర్వసిద్ధిప్రదాయనమః | |
ఉమాపుత్రాయ నమః | ఏకదన్తాయ నమః |
ఆఖువాహనాయ నమః | ఇభవక్త్రాయ నమః |
వినాయకాయ నమః | మూషకవాహనాయ నమః |
ఈశ పుత్రాయ నమః | కుమారగురవే నమః |
దూర్వాయుగ్మపూజా సమాప్తా.
________________________________________________________________________________________
1 సత్పురుషులకు సంతోషముగలిగించు ఓ వినాయకా ! విఘ్నేశా ! భూమియందున్న యావద్ధనములను గ్రహింపుము.
2 ఓవిఘ్నేశా ! వేయి నేతిలో ముంచిన వత్తులును, అనేక కర్పూరపుఁ దునుకలును నుంచి వెలిగించిన నీరాజనమును గ్రహింపుము.