Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినాయక వ్రతము

దివ్యాంగాయ విఘాతకారిణే అవరజజితే
మణికిఙ్కిణిమేఖలాయ విష్వగ్దృశే 100 సమస్తజగదాధారాయ
సమస్తదేవతామూర్తయే విశ్వరక్షాకృతే సర్వైశ్వర్య ప్రదాయ
సహిష్ణవే కల్యాణగురవే ఆక్రాన్తచిదచిత్ప్రభవే
సతతోత్థితాయ ఉన్మత్తవేషాయ శ్రీవిఘ్నేశ్వరాయ నమః 108

శ్రీవర...య నమః, ఆప్టోత్తరశతనామ పూజాం సమర్పయామి.

1. శ్లో. దశాఙ్గం గుగ్గులో పేతం సుగన్ధి సుమనోహరం,
        ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ.
శ్రీవర...య నమః ధూపమాఘ్రాపయామి,
మంత్రము___ ధూరసి ధూర్వ ధూర్వన్తం ధూర్వతం యో౽స్మాన్ ధూర్వతి తం ధూర్వయం వయం ధూర్వామః.

2. శ్లో. సాజ్యం త్రివర్తిసంయు క్తం వహ్ని నా ద్యో తితం మయా,
        గృహాణ మఙ్గ ళం దీపమీశపుత్ర నమోస్తు తే.
శ్రీవర...య నః దీపం దర్శయామి. .
మంత్రము___ఉద్దీప్యస్వ జాత వేదోపఘ్నం నిరృతిం మమ,

____________________________________________________________________________

1. ఓపార్వతీపుత్త్రా! నీకు నమస్కారము. పదియంగములు గలది, గుగ్గిలము వేయఁబడిన పరిమళముగలిగి మనస్సునకు సంతోషముచేయు ధూపము వేయుచున్నాను. పీల్చుము. నాకు వరంబుల నొసఁగుము. 2. ఓపరమేశ్వరునిపుత్త్రుడా! సీకు మ్రొక్కెదను. నేయిపోసి మూఁడువత్తులు వేసి వెలిగించిన మంగళ దీపమును గైకొనుము.