ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వినాయక వ్రతము
19
1. శ్లో. అక్షతాన్ ధనళాన్ దివ్యాన్ శాలీయాం స్తణ్డులాన్శుభాన్,
గృహాణ పరమానన్ద శమ్భుపుత్ర నమో౽స్తు తే.
శ్రీవర...కాయ అలంకరణార్థం ఆక్షతాన్ సమర్పయామి.
మంత్రము—ఆయనే తే పరాయణే దూర్వారోహస్తు పుష్పిణీ,
హ్రదాశ్చ పుణ్డరీకాణి సముద్రస్య గృహా ఇమే.
2. శ్లో, సుగన్ధాని చ పుష్పాణి జాతీకున్దముఖాని చ,
ఏకవింశతిప త్రాణి సంగృహాణ నమో౽స్తు తే.
శ్రీవ....నాయకం పుష్పైః పూజయామి,
అథాంగ పూజా | ||
గణేశాయ నమః | పాదౌ పూజయామి | (పాదములు) |
ఏకదంతాయ నమః | గుల్ఫౌపూజయామి | (మడిమలు) |
శూర్పకర్ణాయ నమః | జానునీ పూజయామి | (మోకాళ్లు) |
విఘ్న రాజాయ నమః | జఙ్ఘే పూజయామి | (పిక్కలు) |
ఆఖువాహనాయనమః | ఊరూ పూజయామి | (తొడలు) |
హేరమ్బాయనమః | కటిం పూజయామి | (పిఱుఁదు) |
లంబోదరాయనమః | ఉదరం పూజయామి | బొజ్జ |
____________________________________________________________________________
1. ఎక్కువ యానంద 'మొసఁగునట్టి యో యీశ్వరుని పుత్త్రుడా! నీకు నమస్కారము. మంచిబియ్యముతోఁ జేసిన యక్షతల నొసఁగుచున్నాను గ్రహింపుము. ఓవినాయకా ! సువాసనగలజాజులు, మొల్లలు మొదలగు పువ్వులతోను, ముఖ్యముగా, ఇరువదియొక్కటి యగు ఆకులతోను బూజించెదనుగ్రహింపుము. నీకు మ్రొక్కెదను.