18
వ్రత రత్నాకరము
వూయమానాః , అభిచన్ద్రా భర్తవేనో హిరణ్యో౽భ్యశ్వాన్ రథి నో దేవసోమ.
1. శ్లో. రాజతం బ్రహ్మసూత్రం చ కాఞ్చనంచోత్తరేయకం,
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక .
శ్రీవ...య యజ్ఞోపవీతం సమర్పయామి
మంత్రము... యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ , ఆయుష్యమగ్ర్యం ప్రతిముఞ్చ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః.
2. శ్లో. చన్దనాగరు కర్పూర కస్తూరీ కుఙ్కుమాన్వితం,
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్.
శ్రీవ...యకం గంధాన్ ధారయామి.
మంత్రము - గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం, ఈశ్వరీగ్ం సర్వభూతానాం త్వామిహోపహ్వయే
శ్రియమ్.
_______________________________________________________________________________ పెద్దబొజ్జ గల ఓశివపుత్రా ! దేవతలకు ధరింపఁదగినవి, చక్కనివియు నైన యీ మేటి యెఱ్ఱబట్టలను ధరింపుము. 1. సర్వము తెలిసిన యోదేవా! భక్తులకోర్కుల నొసఁగు ఓగణాధిపా! రజతముతో నిర్మించినయజ్ఞోపవీతమును, బంగారు మయమైన యుత్తరీయమును గ్రహింపుము.
2. ఓ దేవతలలో శ్రేష్ఠుడా! కస్తూరి, కుంకుమపువ్వు మొదలగు సుగంధ ద్రవ్యములు చేర్చిన గంధము పూసెదను స్వీకరింపుము.