వినాయక వ్రతము
17
లేక, పంచదార — స్వాదుః పవస్వ దివ్యాయ జిన్వనే స్వాదురిన్ద్రాయ సుహవే తు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః (శ్రీవర.. యకం) శర్కరయా స్నపయామి.
ఫలోదకము__యాః ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తా 'నో ముఞ్చస్త్వగ్ం హసః - (శ్రీవర.. యకం) ఫలోదకేన స్నపయామి.
1.శ్లో. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః,
స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమో౽స్తుతే.
శ్రీవరసిద్ధి. ..కం శుధ్ధోదకస్నానం కారయామి.
మంత్రము____ఆపోహిష్ఠా మయోభువః, తాన ఊర్జేధాతన, మహేరణాయ చక్షసే, యో వశ్శివతమో రసః, తస్యభాజయతే హనః, ఉశతీరివ మాతరః, తస్మా అరంగమానవః. 'యస్య క్షయాయ జిన్వథ' ఆపో జనయథా చ నః.
2. శ్లో. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మఙ్గళం ,
శుభ ప్రద గృహాణ త్వం లమ్బోదర హరాత్మజ.
శ్రీవర .. య వస్త్రయుగ్మం సమర్పయామి.
మంత్రము____అభివస్త్రా సువసన్యాస్యర్షాభిధేనోస్సుదుఘాః
________________________________________________________________________________________ 1. ఓభగవంతుడా! ఓపార్వతీపుత్త్రుడా! నీకు నమస్కరించెదను. గంగానది మొదలగు పుణ్యతీర్థములన్ని టినుండి తెచ్చిన నిర్మలోదకములచే స్నానముచేయుము. 2. భక్తులకు మేలొసఁగు
వైదికులు శ్లోకములతోఁ గ్రిందిమంత్రములను గూడ చెప్పెదరు. అట్లే అంతటను తెలియవలెను.