పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

వ్రత రత్నాకరము

శ్లో. స్నానం పఞ్చామృతై ర్దేవ గృహాణ గణనాయక,
    అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత.

శ్రీవరసిద్ధివినాయకాయ [1]పఞ్చామృతస్నానం సమర్పయామి

1. పాలు__ ఆప్యాయస్వ సమేతు తే విశ్వత స్సో మవృష్ణియం, భవా వాజస్య సంగధే ,

శ్రీవర .. నాయకం, క్షీరేణ స్నపయామి.

2. పెరుగు__ దధి క్రావ్ ణో అకార్షం జిష్ణో రశ్వస్య వాజినః సురభినో ముఖాకర త్ప్రణ ఆయూగ్౦షితారిషత్ శ్రీవర .. నాయకం, దధ్నా స్నపయామి.

3. నెయ్యి__శుక్రమసి జ్యోతిరసి తేజో౽సి దేవోవస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః శ్రీవర .. నాయకం ఆజ్యేన స్నపయామి.

4. తేనె___మధు వాతా ఋతాయతే మధు క్షరంతి సింధవః, మాధ్వీర్నస్సన్త్వోషధీః.

శ్రీవర .. నాయకం మధునాస్నపయామి.


1. దీనుల బోషించువాఁడవు, సర్వజ్ఞుఁడవు, దేవతలచేఁ బూజింపఁబడువాఁడవు నైన గణనాయకుఁడా ! పంచామృతములచే నీకు స్నానము చేయించెద అనుగ్రహింపుము.

  1. పంచ అమృతములచే స్నానము చేయుట యనఁగా; ఆవు పాలు,పెరుగు, నెయ్యి, తేనె లేక పంచదార, ఫలోదకము ఇవి పంచామృతములనఁబడును. వీనితో నభిషేకము చేయునప్పుడు ఈ క్రిందిమంత్రములను గూడఁ జెప్పుట కలదు.