159 శ్రీఇష్టకామేశ్వరీలక్ష్మీ వ్రతము
కోర్కులిచ్చు నన్నాకలశమున నావాహనముచేయవలెను. ప్రాతఃకాలమున నిత్యకృత్యములఁ దీర్చుకొని శుచియై ఇంద్రియములను, కరణములను స్వాధీనమున నుంచుకొని నే ననేడు భావనతో 5, 7, 9, 11, సంఖ్యలలో నేదే నొకసంఖ్యకు చెందిన బ్రాహణ స్త్రీలను పిలిచి తనయింట వారికి తలంటి నీళ్లు పోసి వారిపాదముల ఎఱ్ఱగంధమున నలంకరించవలెను. వారి యన్ని అవయవములను గంధము పూదండలు మొదలగువానితో పూజించి చలిమిడిని (వరిపిండి చక్కెరతో కలిపి జలమున నార్ధ్రమొనరించిన పదార్థము) వాయనమిచ్చి తొంబూలాదుల నీయవలెను. బ్రాహణున కొకనికి ప్రత్యేకముగ వాయన మిచ్చి పండితుఁడైనవాడు పూజించవలయును. అరటి, కొబ్బెర, చెరకు, ఖర్జూరము మొదలగుపదార్థములను దేవికి నైవేద్యముగా సమర్పించవలయును, ఇటు లాపూజను ముగించి తన కొంగును రెండు చేతులపట్టుకొని ఆస్త్రీలను "కొంచెము ప్రసాదింపుడు” అని ప్రార్థించెను. అపుడా స్త్రీలు బొమదివరకు పుచ్చుకోనిన చలిమిడిపండ్లు మొదలగువానిని కొంచెము విదల్ప వలయును. వారిచే విదల్పఁబడిన ఆస్వల్పమును భార్యతో గూడ పుచ్చుకొనవలెను, ఆతరువాత బ్రాహణసమారాధనము చేయవలెను. ఇటు లీవ్రత మాచరించి నిత్యమును పూజచేయుచు వివాహాదిమంగళ సమయమున మొదట కామేశ్వరిని పూజించి ఆధివ్యాధులు లేకయుండును. పూర్వకాలమున మావారందరు ఎల్లవేళలను ఏమరక కామేశ్వరిని పూజించుచుండెడివారు. నీవొకసారికూడ ఆదివ్యురాలిని స్మరింపవయితివి. అందువల